రంగారెడ్డి జిల్లా నార్సింగీలో శనివారం ఇజాయత్ అలీ అనే ఇంజనీర్ దారుణ హత్యకు గురైయ్యాడు. దుబాయ్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నా అలీ గత 20 రోజుల క్రితం అతను ఇండియాకు వచ్చాడు. ఓ క్వాలీస్ కారులో ఇద్దరు యువకులతో పాటు ఓ లేడి అలీని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి హత మార్చారు. స్థానికుల సమాచారం మేరకు నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కారు,రెండు ఫోన్లు సీజ్ చేశారు.