గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన భవనం.. భయాందోళనలో స్థానికులు

65చూసినవారు
గచ్చిబౌలి సిద్దిఖ్‌నగర్‌లో 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. దాంతో అందులో నివసించే వారితో పాటు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం పక్కనే మరో బిల్డింగ్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెల్లార్‌ కోసం తవ్విన గుంతకారణంగా ఆ వైపున భవనం పిల్లర్లు కుంగడంతో పక్కకు ఒరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. సమీప భవనాల్లో నివసించేవారిని ఖాళీ చేయిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్