మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన మైనర్ బాలిక దారుణ హత్య కేసు మిస్టరీ వీడినట్లు స్థానిక పోలీసులు తెలియజేశారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక సీఐ క్రాంతి మాట్లాడుతూ. ఈ నేల పదోవ తేదీన ఐశ్వర్య కుటుంబ సభ్యులు అమ్మాయి అదృశ్యం అని పిర్యాదు చేసిన నేపథ్యంలో దర్యాప్తు చేయగా. ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన విగ్నేష్& అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.