![](https://media.getlokalapp.com/cache/99/b8/99b836dd8f4e8e55feeb98b6e34357f4.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
ఆసీస్‌ను వణికించాం: బుమ్రా (వీడియో)
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయినా గట్టి పోటీనిచ్చామని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. గాయంతో బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై బౌలింగ్ చేయకపోవడం అసహనానికి గురిచేసిందన్నాడు. అయినప్పటికీ ఆసీస్‌ను వణికించాం అని పేర్కొన్నాడు. చాలా మంది కుర్రాళ్లు ఈ సిరీస్‌తో అనుభవంతో పాటు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారని అభిప్రాయపడ్డాడు. మేం మా తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకు సాగుతామని చెప్పుకొచ్చాడు.