పల్లెలు దేశానికి పట్టు కొమ్మలని పదే పదే వేదికలపై చెబుతుంటారు. కానీ రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రెఖ్యతండా గ్రామ పంచాయితీలో చెత్త సేకరించే ట్రాక్టర్ కు డీజిల్ లేక గురువారం రోడ్డు పక్కన నిలిపారు. పంచాయితీకి సర్పంచి లేడు. కార్యదర్శి బదిలీపై వెళ్ళింది. కొత్త కార్యదర్శి పంచాయితీకి వచ్చిన ఎవ్వరికి తెలువదు. పెట్రోల్ బంక్ వాళ్ళు ఉద్దెర డీజిల్ అడిగిన పోయకపోవడంతో బంక్ పక్కన ట్రాక్టర్ ని నిలిపారు.