ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2009 లో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నవంబర్ 29 ని బీఆర్‌ఎస్ పార్టీ ప్రతి యేడు దీక్షా దివస్‌గా పాటిస్తున్న సందర్భంగా శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలంలోని అన్ని గ్రామాలు, తండాలలో గులాబీ జెండా రెపరెప లాడింది. పార్టీ కార్యకర్తలు ముఖ్య నేతలు జెండా ఆవిష్కరణలో పాల్గొని జై తెలంగాణా జై కేసీఆర్ నినాదాలు చేశారు.