తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలంగాణ ఎమ్మెల్యే సిఫార్సు లేఖల అంశంపై ప్రభుత్వంతో చర్చించి పునరాలోచించాలని
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ అంశంపై స్పందించారు. తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల అంశంలో టిటిడి పెద్ద మనసుతో ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు.