షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు శుక్రవారం పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా 2025 డైరీలతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ఎమ్మెల్యేకు బహుకరించారు. అనంతరం వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శతాబ్ది టౌన్ షిప్ యజమాని శ్రీనివాస్ రెడ్డి, గురు రాఘవేంద్ర జనరల్ స్టోర్ యజమాని రవికుమార్, ఎమ్మెల్యేకు డైరీలను అందజేశారు.