షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం చించోడ్ గ్రామస్తులు ప్రజల శ్రేయస్సు కోసం, గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళా సంఘం నాయకులు ఏకమై గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం పాటించాలని తీర్మానించారు. గ్రామస్తుల తీర్మానాన్ని కాదని ఎవరైనా గ్రామంలో అమ్మితే చర్యలు తప్పవన్నారు.