షాద్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను త్వరగా చేపట్టడమే కాకుండా నాణ్యత విషయంలో నో కాంప్రమైజ్ అని, ఈ భవనం చరిత్రలో చిరకాలంగా నిలిచిపోవాలని మ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం షాద్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.