గత పదేళ్లలో రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసి ఇచ్చిన హామీలకు కట్టుబడకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై అవాకులు చవాకులు మాట్లాడడం హాస్యాస్పదమని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విమర్శించారు. ఆదివారంఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ పీ రఘు మాట్లాడారు.