ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షాద్ నగర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న యువ నాయకుడు ఎవరో సదరు ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ నాయకులే పోలీసులకు ఆచూకీ చెప్పాలని, లేకపోతే చట్ట ప్రకారం ఆ నాయకుడి అరాచకాల అంతు తేలుస్తామని షాద్ నగర్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ఆదివాసి రాష్ట్ర కోఆర్డినేటర్ పి. రఘునాయక్ మాట్లాడారు.