సర్పంచ్ పదవిని అడ్డుపెట్టుకొని చెరువు మట్టిని అక్రమంగా అమ్ముకున్న ఘనుడివని, నీలాంటి వాళ్లకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత లేదని ఆ పార్టీ కేశంపేట మండల అధ్యక్షుడు గూడ వీరేశం అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు రమేష్ యాదవ్ ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారని ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆదివారం స్థానిక కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు రమేష్ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడారు.