కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల జాతర మొదలైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ప్రజలు ఆసక్తి చెబుతున్నారని షాద్ నగర్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ స్పష్టం చేశారు. కొందుర్గు మండలం శ్రీరంగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారుల ఇళ్ళ నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.