డి. శ్రీనివాస్ మృతి పట్ల షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ సంతాపం

71చూసినవారు
డి. శ్రీనివాస్ మృతి పట్ల షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ సంతాపం
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు. డీ. శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని అన్నారు.

సంబంధిత పోస్ట్