విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ

53చూసినవారు
విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ
విద్యార్థుల్లో అసమానతలను తొలగించి అందరూ సమానంగా ఉండాలనే భావంతో రూపొందించిన ఏకరూప దుస్తులను ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందజేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. సోమవారం షాద్ నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న డ్వాక్రా భవనంలో ఫరూక్ నగర్ మండల విద్యార్థులకు మొదటి విడతగా 9 వేల ఏకరూప దుస్తులను ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్