ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించాలని శనివారం షాద్ నగర్ ఉప రవాణా శాఖ అధికారి వాసు సూచించారు. జాతీయ రహదారుల భద్రత మహోత్సవాల సందర్భంగా జనవరి 1 నుండి 31 వరకు వాహన దారులకు ట్రాఫిక్ నిబంధనలపై, ప్రమాదాలు జరగడానికి కారణాలపై, వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.