షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం గంగన్నగూడ గ్రామంలో శనివారం గంగన్నగూడ ప్రీమియర్ లీగ్ సీజన్ 5 కి ముఖ్యఅతిథిగా PACS చైర్మన్ చిట్టెం దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలగజేస్తాయని క్రీడల వల్ల శరీర దారుఢ్యం పెరుగుతుందని క్రీడల వల్ల శరీరానికి వ్యాయామం జరుగుతుందని తద్వారా చాలా రకాల రోగాలకు దూరంగా ఉంటామని అన్నారు.