
దారుణం.. మూడేళ్ల చిన్నారిపై యువకుడు హత్యాచారయత్నం
TG: వరంగల్ జిల్లా గిర్మాజిపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రంజాన్ అనే యువకుడు.. మూడేళ్ల చిన్నారిపై హత్యాచారయత్నం చేశాడు. ఈ క్రమంలో సదరు చిన్నారి గట్టిగా ఏడవడంతో స్థానికులు గమనించి.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.