హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 57వ వర్ధంతి సందర్భంగా శనివారం మండల పరిషత్ ఆవరణలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ. బూర్గుల రామకృష్ణారావు గొప్ప సామాజిక సంస్కర్త అని నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణలో సంస్కృతిక అభివృద్ధి పునాది వేసిన మహానీయుడు అని తెలియజేశాడు.