ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడులో మంగళవారం జరుగుతున్న ఆరోగ్య మహిళా ప్రోగ్రామ్ ను షాద్ నగర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి. విజయలక్ష్మి సడన్ విజిట్ చేసి, అక్కడ ఓ. పి రిజిస్టర్ ను పరిశీలించారు. తదుపరి పిహెచ్ సి వైద్య అధికారి డాక్టర్ స్రవంతితో మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళా ప్రోగ్రామ్ కు వచ్చిన మహిళలందరికీ వారికి కావలసిన పరీక్షలు అన్నీ చేయించాలని, వారికి కావలసిన మందులు అన్ని అందజేయాలని తెలియచేశారు.