

నా పుట్టిన రోజు ఈడీ ఆఫీస్‌లో జరుపుకుంటా: వాద్రా (వీడియో)
రాబర్ట్ వాద్రా మూడు రోజులగా ఈడీ విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. గురువారం కూడా ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. శుక్రవారం తన పుట్టిన రోజు అని, కానీ ఈసారి తన పుట్టిన రోజును ఈడీ ఆఫీస్‌లోనే జరుపుకుంటానని అన్నారు. అధికారులు కొత్త ప్రశ్నలు ఏం అడగట్లేదన్నారు. ఇది ఇలా ఉంటే తాను త్వరలో పాలిటిక్స్‌లోకి వస్తానంటూ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.