
చైనా మీడియా సంస్థ ఎక్స్ అకౌంట్‌ను నిలిపేసిన భారత్
చైనా ప్రాపగండా మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ తప్పుడు, అపోహలు కలిగించే కథనాలు ప్రచురిస్తున్నదని ఆరోపిస్తూ, భారత్ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ టైమ్స్‌కు చెందిన ఎక్స్ (పూర్వపు ట్విటర్) అకౌంట్‌ను "విత్‌హెల్డ్" లో ఉంచింది. కాగా, ఉగ్రవాదులు, వారి స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ తీరును ప్రపంచదేశాలను సమర్థిస్తుంటే.. గ్లోబల్ టైమ్స్ పాక్‌కు అనుకూలంగా ప్రచారం చేసినట్లు భారత్ గుర్తించింది.