రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో మహిళలు అత్యధికంగా ఆయా గ్రామాల నుండి తరలివచ్చారు. గ్రామంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహానలకు పూలమాలలు వేసిన ఎమ్మెల్యే శంకర్ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.