రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం భవనం స్లాబ్ పనులను కొబ్బరికాయ కొట్టి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కాంగ్రెస్ తోనే న్యాయం జరిగిందని అన్నారు.