షాద్ నగర్ నియోజక వర్గంలోని కొందుర్గ్ మండల కాంగ్రెస్ జడ్పీటిసి ఎదిరే రంగమ్మ సోమవారం మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్లో చేరారు. వారికి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తిరిగి సొంత పార్టీకి రావడం చాలా సంతోషంగా ఉందని రంగమ్మ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు గుర్తింపు లేదని, ఆ పార్టీ విధానాలు సరిగ్గా లేవని అన్నారు.