మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా శనివారం షాద్ నగర్ పట్టణంలో గంజ్ లో లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి, స్థానిక నాయకులతో కలిసి షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి నివాళులు అర్పించారు. జై జవాన్, జై కిసాన్ అంటూ దేశ దృక్కోణాన్ని మార్చిన దార్శనికుడు, దేశం కోసం స్వాతంత్ర సమరయోధుడిగా, ప్రధానిగా శాస్త్రి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు.