షాద్ నగర్ పట్టణానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొగిలిగిద్ద గ్రామానికి ఈ మధ్యన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి నిధులు శాంక్షన్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అలాంటి మొగిలిగిద్ద గ్రామంలో గత రెండు నెలలుగా పైపుల లీకేజీ ద్వారా మురుగునీరు రోడ్డు మీద ప్రవహిస్తున్న పట్టించుకునే నాధుడు లేడు అంటూ ఆదివారం స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తపరిచారు.