షాద్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బుధవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మున్సిపల్ చైర్మన్ నరేందర్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ వో డాక్టర్ విజయలక్ష్మి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన, పోషకాహారం గురించి విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, వారికి కావలసిన మందులను వైద్య సిబ్బంది అందజేశారు.