రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మధురపురం గ్రామంలో శనివారం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కార్యక్రమాల కోసం పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రి సీతక్క, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలకు గ్రామస్తులు భారీ స్వాగతాన్ని ఏర్పాటు చేశారు.