రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పట్టణ శివారులోని చౌడమ్మ గుట్ట హనుమాన్ దేవాలయంలో శనివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘనంగా పూజలు నిర్వహించారు. అర్చన అభిషేకాలతో పాటు గోపూజను ప్రత్యేకంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ హిందూ సంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ మాసంలో శివ కేశవులిద్దరితో పాటు సకల దేవతలను ఆరాధిస్తుంటారని అన్నారు.