షాద్‌నగర్ పట్టణంలోని ఓల్డ్ హైవే రోడ్డు విస్తరణ పనులను త్వరగా చేపట్టిన ప్రముఖ కాంట్రాక్టర్ మోహన్ రెడ్డిని గురువారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మర్యాదపూర్వకంగా సన్మానించారు. అనుకున్న సమయం ప్రకారం రోడ్డును నాణ్యతగా నిర్మించడంతో పాటు ప్రజలు కోరిన విధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ తెలిపారు.