
"ఉగ్రవాద సంస్థల పునర్నిర్మాణానికి పాకిస్థాన్ రూ.14 కోట్లు ఆర్థిక సాయం"
గుజరాత్లో భుజ్ ఎయిర్‌బేస్‌లో మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పాకిస్థాన్ ప్రభుత్వం మురిద్కే, బహవల్పూర్లో ఉన్న లష్కరే తోయిబా, జైషే-ఏ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థల పునర్నిర్మాణానికి రూ.14 కోట్లు ఆర్థికసాయం ప్రకటించిందని ఆయన ఆరోపించారు. అంతేగాక, IMF విడుదల చేసిన ఒక బిలియన్ డాలర్ల రుణంలో చాలా భాగం ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మాణానికే ఖర్చు చేసే అవకాశం ఉందని అన్నారు. దీనిపై IMF పునర్విచారణ చేయాలని సూచించారు.