
సిక్కిం విలీనానికి ఏభై ఏళ్ళు పూర్తి
1975 మే 16న సిక్కిం భారతంలో విలీనమైన చారిత్రక ఘట్టానికి ఈ సంవత్సరంతో 50 ఏళ్ళు పూర్తయ్యాయి. నేపాల్, భూటాన్ మధ్య హిమాలయ పర్వతాలలో ఒదిగిన సిక్కింలో 1948లో రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం, 1973లో ప్రజా ఉద్యమంగా మారింది. 1974లో సిక్కిం ప్రధాని భారత్తో విలీనాన్ని కోరగా, రిఫరెండం ద్వారా ప్రజల మద్దతుతో 1975 ఏప్రిల్లో చొగ్యాల్ పాలనకు ముగింపు పలికి, మే 16న సిక్కిం 22వ రాష్ట్రంగా ఏర్పడింది.