ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తమ పరిధి దాటి గ్రామీణ వైద్యులు (ఆర్ఎంపి) వైద్యం చేయకూడదని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ స్ధానిక ప్రైవేట్ ఆర్ఎంపి వైద్యులకు హెచ్చరించారు. కొత్తూరులో గిరిజన మైనర్ బాలిక అబార్షన్ సంఘటన నేపథ్యంలో షాద్ నగర్ డివిజన్ వైద్యఆరోగ్యశాఖ జిల్లా ఉపఅధికారిని డాక్టర్ విజయలక్ష్మి తోపాటు స్థానిక ఆర్. ఎం. పి వైద్యులను శుక్రవారం పిలిపించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.