ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో న్యాయం, ధర్మం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి విజయం సాధించామని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ళ నరసింహ మాదిగ తెలిపారు. గురువారం షాద్ నగర్ చౌరస్తాలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి సంబరాలు చేసుకున్నారు.