కేశంపేట మండలం బిఆర్ఎస్ పార్టీకి చెందిన సంతాపూర్ ఎంపీటీసీ రాజు తిరిగి సొంత గూటికి చేరుకున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన రాజు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడం గమనార్హం. రాజును సోమవారం ఉదయం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో పార్టీలో చేర్చుకున్నారు కండువా వేసి ఆహ్వానించారు.