రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పలు లాడ్జీల్లో పోలీసులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇతర ప్రాంతాలలో బస చేసే లాడ్జీల్లోని రికార్డులను షాద్ నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ లాడ్జీల్లో బస చేసే వారి వద్ద సరైన ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని, అందరి వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు.