మత రాజకీయాలను ప్రోత్సహించం: నటుడు విజయ్
తమిళనాడులోని విల్లుపురంలో టీవీకే పార్టీ అధినేత నటుడు విజయ్ ఆదివారం మహానాడు సభను నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీవీకే పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తాము ఎవరికీ A, B టీమ్ కాదన్నారు. రాజకీయాల్లో నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా కూడా పట్టించుకోనున్నారు. దేవుడు లేడనే పెరియార్ సిద్ధాంతాలకు మేం వ్యతిరేకం. మత రాజకీయాలను ప్రోత్సహించం అని ఆయన పేర్కొన్నారు.