భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని షాద్ నగర్ పట్టణంలోని శ్రీ శివమారుతీ గీతా అయ్యప్ప మందిరలో శనివారం శ్రీ గిరిజామృత లింగేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని దేవాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ లష్కర్ ఆంజనేయులు, కార్యదర్శి రెటికల్ నందీశ్వర్, కోశాధికారి దాస కృష్ణయ్య ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.