
భారత్ బంద్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే!
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం కార్మిక సంఘాలు ఈ నెల 20న నిర్వహించాల్సిన భారత్ బంద్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి. మళ్లీ జులై 9వ తేదీన బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. కాగా, ఈ బంద్ ద్వారా కార్మికులు శ్రామిక విధానాలు, ఉద్యోగ భద్రత, కనీస వేతనం రూ.26,000 చేయడం, పెన్షన్‌ను రూ.39,000కు పెంచడం వంటి డిమాండ్లను సాధించేందుకు బంద్ చేపట్టనున్నట్టు పేర్కొన్నాయి.