డ్రగ్స్ తో వ్యాపారం చేస్తూ యువతను పక్కమార్గం పట్టించి వారి జీవితాలను నాశనం చేయడమే కాకుండా దేశ భవిష్యత్తును దెబ్బతీస్తున్న వ్యక్తులను ఉరితీయాలని టాలీవుడ్ సినీ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం షాద్ నగర్ పట్టణంలో దివంగత మల్లేష్ యాదవ్ పేరు మీద ఆయన కుమారుడు సాయినాథ్ యాదవ్, ఉపేశ్ యాదవ్ లు నిర్వహిస్తున్న కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.