షాద్ నగర్: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు కుర్చీలు అందజేసిన కబీర్

83చూసినవారు
షాద్ నగర్: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు కుర్చీలు అందజేసిన కబీర్
షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు గాంధీ నగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు కబీర్ తన సొంత ఖర్చులతో 100 కుర్చీలు
మంగళవారం అందజేయడం జరిగింది. ఈ కుర్చీలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో ప్రిన్సిపాల్ కు అందజేయడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దాన గుణం ఉన్న వ్యక్తులు గ్రామ అభివృద్ధి కాంక్షించే యువకులు ఉన్న గ్రామం ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్