ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం రైతు పండగలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. రైతు పండుగలో భాగంగా మూడు రోజుల పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులు & వివిధ పంట ఉత్పత్తుల గురించి రైతులకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొంటున్నారు.