ఫరూక్ నగర్ మండల్ చించోడు గ్రామంలో జాతీయ బీసీ సేన మండల అధ్యక్షురాలు జలజ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన చించోడు గ్రామ మహిళా బీసీ సేన అధ్యక్షురాలు ఎన్నిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వు సుధాకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు బాస వరలక్ష్మి, నియోజకవర్గం కార్యదర్శి జూపల్లి చంద్రశేఖర్, ఫరూక్ నగర్ మండలం అధ్యక్షులు మేకల వెంకటేష్ పాల్గొన్నారు.