షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయం, రామాలయం ప్రారంభోత్సవ భక్తి కార్యక్రమాలను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ధ్వజ స్తంభం, నవగ్రహాలకు నీళ్ళు పోసి పూజ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ దొడ్డి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, సభ్యులు పాల్గొన్నారు.