రైతులు వ్యవసాయానికి అనుబంధంగా చేసుకునే పాడికి సంబంధించి నష్టాలలో కూరుకుపోకుండా నిరంతరం ప్రభుత్వం తరఫున పాడి రైతులకు తోడుగా ఉంటానని స్ధానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ హామీ ఇచ్చారు. పట్టణంలోని పాలశీతనీకరణ కేంద్రంలో తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య షాద్ నగర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.