షాద్ నగర్ పట్టణంలోని ఎస్టీ కాలేజ్ హాస్టల్ లో సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే దేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలని వారు అన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని పేద మహిళలకు పాఠశాలలు ఏర్పాటు చేసి చదువు చెప్పిన మహనీయురాలని కొనియాడారు.