జీఓ నెం. 81 ప్రకారం 61 సంవత్సరాలు వయస్సు పైబడిన వీఆర్ఏల వారసులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలనీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను వీఆర్ఏ జేఏసీ నాయకులు కోరారు. శనివారం ఫరూక్ నగర్ మండలం మధురాపురం గ్రామంలో మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను కలుసుకున్న వీఆర్ఏ జేఏసీ నాయకులు మంత్రి సీతక్కకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే ద్వారా అందజేశారు.