

పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి దారుణ హత్య (వీడియో)
AP: విజయవాడలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్కు కొద్ది దూరంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వివరాల ప్రకారం.. విజయనగర్ కాలనీకి చెందిన లక్ష్మణ్ ను తన స్నేహితుడు మద్యం మత్తులో బండరాయితో కొట్టి చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని సీఐ ప్రకాశ్ పేర్కొన్నారు.